కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో చమురు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ ఓఎన్జీసీ సంస్థ తూర్పు గోదావరి జిల్లాలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించింది. ప్రజా చైతన్య ఉద్యమంలో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛభారత్ ఇతివృత్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని...స్వచ్ఛభారత్ పై అందర్ని ఆలోచింపజేసే విధంగా చిత్రాలు తీర్చిదిద్దారు. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు కేటగిరీలుగా విభజించి ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందజేశారు.
ఇది చూడండి: జొమాటో ఇంటి భోజనాలు వచ్చేస్తున్నాయ్!