కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఓఎన్జీసీ ప్రతినిధులు... రాజమహేంద్రవరంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సుమారు కోటి రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. సంస్థ అసెట్ మేనేజర్ పటేల్, వివిధ విభాగాల అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెక్కులు అందించారు. ఈ నిధులతో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంటు, మౌలిక వసతులు, తాగునీటితో పాటు ఫర్నీచర్ సమకూరనున్నాయి. ఈ ఏడాది 30 కోట్ల రూపాయలతో సీఎస్ఆర్ నిధుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ మేనేజర్ ఆర్పీ పటేల్ తెలిపారు.
ఇది కూడా చదవండి.