జీ. మామిడాడ గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి అనే వ్యక్తి తన మేనల్లుడిని కొట్టాడనే కారణంతో అదే గ్రామంలోని సూర్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లాడు. ఇంద్రారెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి, సూర్యచంద్రారెడ్డి వెళ్లగా సూర్యనారాయణరెడ్డి వారిపై కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో ఇంద్రారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. రామసుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా.. సూర్యచంద్రారెడ్డికి గాయాలయ్యాయి. నిందితుడు సూర్యనారాయణరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతనికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి.. రంపచోడవరంలో గిరిజన బాలికపై అత్యాచారం