వృద్ధురాలు అనుమానాస్పద మృతి - చెముడులంకలో గుర్తు తెలియని వృద్ధురాలు అనుమానాస్పద మృతి
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలోని ఏటిగట్టుపై గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది పడి ఉంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ వి.సుభాకర్, సీఐ కె. మంగాదేవి దర్యాప్తు చేశారు. మృతురాలు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉంటారు.. అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. ఆమె కుడి చేతిపై దేవి అని పచ్చ బొట్టు ఉందని తెలిపారు.