ETV Bharat / state

సందిపూడికి చేరిన కరోనా.. అప్రమత్తమైన అధికారులు - ఈరోజు తూర్పు గోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సందిపూడికి చెందిన వ్యక్తి కరోనా వైరస్​ ప్రభావంతో మృతి చెందాడు. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మృతిచెందిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వారి రక్త నమూనాలు పరీక్షించనున్నారు.

officers-alert-to-increase-corona
సందిపూడికి చేరిన కరోనా.అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : Jun 27, 2020, 3:54 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సందిపూడికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని తల్లికి అనారోగ్యంగా ఉన్న కారణంగా.. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. అనంతరం సదరు వ్యక్తి అనారోగ్యం బారిన పడి రామచంద్రపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పర్యటించి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పీహెచ్సీ వైద్యాధికారి సుదర్శన బాబు ఆధ్వర్యంలో మృతునితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న 25 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఆలమూరు మండలంలో ఇప్పటివరకు గుమ్మిలేరు, పెనికేరు, నర్సిపూడి గ్రామంలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం సందిపూడిలో కరోనా కేసులు రావడం వైరస్ ప్రభావిత గ్రామాల సంఖ్య నాలుగుకు చేరింది.

ఇవీ చూడండి:

తన స్థలంపై 'గవర్నమెంట్' అని రాశారని.. యజమాని ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.