తుపాను ప్రభావం ఉప్పాడ తీరంపై పడింది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు ఏర్పడి సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ కెరటాలు ఎగసిపడటంతో తీరప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట, మాయాపట్నం, కోరాడపేట ప్రాంత గ్రామాలు కోతకు గురై పదుల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. కెరటాల తీవ్రతకు ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు స్వల్పంగా దెబ్బతింది. దీంతో ప్రమాదం అని గుర్తించిన అధికారులు అటుగా రాకపోకలు నిలిపేశారు.
ఇదీచదవండి