విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటిని సాధించే వరకూ క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించాలని... కుసులూరి కాంచన శ్రీవల్లీ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ BVS ప్రసాద్ సూచించారు. అమలాపురం పట్టణంలోని వెచ్చావారి అగ్రహారంలో ఉన్న బాలికల జూనియర్ కళాశాలలో కుసులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు. కళాశాలలోని 100 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికీ 12 చొప్పున రాతపుస్తకాలు అందజేశారు. గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. అంతకుముందు రాజోలు జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు రాతపుస్తకాలను ట్రస్ట్ సభ్యులు పంపిణీ చేశారు.
విద్యార్థినులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ - east godavari
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని జూనియర్ కళాశాలలో కుసులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినులుకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు.