ETV Bharat / state

నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!

చిన్నారులను కాపాడే దేవతగా... చింతలు తీర్చే తల్లిగా... భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకుంటున్న నూకాలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో ఉన్న ఈ ఆలయ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

author img

By

Published : Apr 4, 2019, 8:33 PM IST

నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!
వైభవంగా నూకాలమ్మ జాతర
తూర్పుగోదావరిజిల్లాలోజరిగే ప్రధాన తీర్థ మహోత్సవాల్లో నూకాలమ్మ జాతర ప్రముఖమైనది. నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. చిన్నారులను నూకాలమ్మ దేవాలయానికి తీసుకొని వచ్చి... కాగడాలు వెలిగించి కోడి పిల్లలతో వారికి దిష్టి తీయిస్తే మంచి జరుగుతోందని తల్లిదండ్రుల నమ్మకం. అందుకే పిల్లాపాపలతో కలిసి.. భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం పాలు, మజ్జిగ ఉచితంగా అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఆలయ అధికారులు చెప్పిన ప్రకారం.. ఈ సంవత్సరం జరిగే అమ్మ వారి తీర్థ మహోత్సవానికి సుమారు 10 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాంగణమంతా చలువ పందిళ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు. నేటి రాత్రి జరిగే అమ్మవారి జాగరణకు అన్ని వసతులు సమకూర్చారు. శుక్రవారం తీర్థ మహోత్సవం, 6న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి....'అన్నవరం దేవస్థానం ఈవోగా సురేష్ బాబు'

Intro:ap_atp_57_04_tdp_complaint_ro_avb_c10
date:04-04-2019
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
ఓటమి భయంతోనే ప్రలోభాలు
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి పెనుగొండ అ తదితర మండలాల్లో లో వైకాపా నాయకులు ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు క్రమ సంఖ్య కలిగిన కార్డులు పంపిణీ చేస్తూ ఆ కార్డును తాము సూచించిన స్థలంలో ఇస్తే నగదు ముట్ట చెప్తారని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఈ సంఘటనపై పెనుకొండ లోని తెదేపా నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు
బైట్:మాదవనాయుడు

Body:ap_atp_57_04_tdp_complaint_ro_avb_c10

Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.