తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివిస్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున పవన్‌కు అనుమతి నిరాకరిస్తున్నామని ఎస్పీ నయీమ్ అస్మీ వెల్లడించారు. ఈ క్రమంలో జనసేనాని పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా సంస్థ తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందంటూ ఆందోళన చేపడుతున్న స్థానికులకు మద్దతు పలికేందుకు ఈ నెల 9న పవన్ వెళ్లనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తుని చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల లాఠీఛార్జ్‌లో గాయపడినవారిని పవన్ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన