తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఎస్సీ యువకుడి శిరోముండనం వ్యవహారంలో మరో ఘటన వెలుగు చూసింది. ఈ ఉదంతంలో ప్రసాద్ తన పేరు వాడుకోవడం బాధాకరమని.. విజయబాబు అనే యువకుడు వాపోయాడు. దీనికి సంబంధించి ఓ వాట్సాప్ వీడియో విడుదల చేశాడు. ప్రసాద్‌పై ఇంతకు మునుపే పలు కేసులున్నాయని చెప్పాడు. తనకు.. ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఆరోజు రాత్రి తన స్నేహితులతో కలిసి తాను మునికూడలిలో రాత్రి వరకూ ఉన్నానని.. ప్రసాద్ ఆయన స్నేహితులు మద్యం సేవించారని తెలిపాడు.
తిరిగి తన స్వగ్రామం ముగ్గళ్ల వెళ్తుండగా గుంటలో పడటంతో కాలు విరిగిందని విజయబాబు పేర్కొన్నాడు. అనంతరం తనను బంధువులు ఆస్పత్రిలో చేర్చారని చెప్పాడు. ప్రస్తుతం విజయబాబు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి..