తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కొత్త ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. చైర్మన్‌గా ఐ.వి. రోహిత్‌తో సహా 16 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సహాయక కమీషనర్ రమేష్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా మహిళ సభ్యులు సాదు దుర్గ, నట్రా మహేశ్వరి, చిట్టూరి సావిత్రి, అప్పారి లక్ష్మీ, ములికి సూర్యవతి, బి. ఆశాలత, కర్రా వెంకటలక్ష్మీలు ప్రమాణ స్వీకారం చేయగా... అనంతరం ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు రోహిత్ చైర్మన్‌గా, సభ్యులుగా కర్రి భామిరెడ్డి, కలగా రామ జోగేశ్వర శర్మ, వాసిరెడ్డి జగన్నాధం, గాదె రాజశేఖర్ రెడ్డి, ముత్యాల వీరభద్రరావు, మోక సూర్యనారాయణ, చాగంటి వెంకట సూర్యనారాయణ, ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా ప్రధాన అర్చకుడు కొండవీటి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదీ చూడండి: వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ.45.21 లక్షలు