స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రకాల కూరగాయలతో జాతీయపతాకాన్ని చేసి దేశంపై తమ కుటుంబానికున్న అభిమానాన్ని చాటుకుంది ఓ కుటుంబం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన వేద పండితుడు రెడ్డి సురేష్ శర్మ, అతడి సోదరుడు సతీష్ శర్మ ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి జాతీయ పతాకాన్ని తయారు చేస్తారు. ఈ ఏడాది టమోటా, క్యాబేజీ, దొండకాయ, వంకాయ, బంగాళదుంప లాంటి వివిధ రకాల కూరగాయలను ఉపయోగించి జాతీయ పతాకాన్ని రూపొందించారు.
దేశభక్తికి 'సెల్యూట్'... 'కూరగాయల'తో జాతీయ పతాకం! - కూరగాయలు
దేశంపై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. ఓ కుటుంబ జాతీయ పతాకాన్ని కూరగాయలతో చేసి తమ అభిమానాన్ని తెలియజేసింది.