ETV Bharat / state

CID Arrest Adireddy సీఐడీ అదుపులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కుమారుడు వాసు.. ఖండించిన లోకేశ్ - సీఐడీ అరెస్ట్ పై చంద్రబాబు

Adireddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు స్పందించారు. సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని లోకేశ్ విమర్శించారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో.... బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్షకట్టడం దారుణమని మండిపడ్డారు.

Adireddy Apparao
ఆదిరెడ్డి అప్పారావు
author img

By

Published : Apr 30, 2023, 4:09 PM IST

Updated : Apr 30, 2023, 4:27 PM IST

TDP Leaders Adireddy Apparao: తెలుగుదేశం నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఆదిరెడ్డి ఇంటికి వచ్చిన సీఐడీ బృందం..ఆరున్నర గంటల సమయంలో తండ్రీకుమారులను అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం రాజమహేంద్రవరంలో జగత్‌జనని చిట్స్‌ నిర్వహిస్తోంది. జగత్‌ జనని చిట్స్‌కు సంబంధించి నెలరోజుల క్రితం సీఐడీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ కేసులో ఎలాంటి అరెస్టులు కాకుండా కోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. అయినా సీఐడీ పోలీసులు ప్రాంతీయ కార్యాలయానికి వీరిని తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో ఇప్పటి వరకూ సీఐడీ అధికారులు ప్రకటించలేదు.

హైకోర్టు నుంచి ఆర్డర్: ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణలు పెద్దఎత్తున సీఐడీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. మేనెల 27, 28 వ తేదీల్లో తెలుగుదేశం మహానాడు కార్యాక్రమాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును ఆదిరెడ్డి వాసు చూస్తున్నారు. కక్షపూరితంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. గతంలో ఇచ్చిన నోటీస్‌కి సమాధానం ఇచ్చామని... ఆదిరెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. ముందస్తు అరెస్ట్ చేయకూడని హైకోర్టు నుంచి ఆర్డర్ ఉందని ఆయన స్పష్టం చేశారు.

స్పందించిన నారా లోకేశ్ : ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. ఫిర్యాదులు లేని కేసుల్లో టీడీపీ బీసీ నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం, A-1 దొంగ పాలనలోనే సాధ్యమని మండిపడ్డారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో.... బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్షకట్టడం దారుణమన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని లోకేశ్‌ స్పష్టం చేశారు.

సీఐడీ దాడులు చేస్తోంది: వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల పేరుతో తెదేపా నేతల ఇళ్లపై సీఐడీ దాడులు చేస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాసుల అరెస్ట్ దుర్మార్గం అని పేర్కొన్నాడు. స్థానిక నేతల్ని భయపెట్టాలన్న కుట్రలో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా భయపడేది లేదనీ.. వైసీపీ ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేవరకు విశ్రమించమని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశాడు.

అరెస్టులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని టీడీపీ నేత చినరాజప్ప పరామర్శించారు. సీఐడీ కార్యాలయం వద్ద పరిస్థితిని ఆరా తీశారు. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ అభివృద్ధిని ప్రక్కన పెట్టి... ప్రతిపక్ష నేతల అరెస్టులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చినరాజప్ప విమర్శించారు. సజ్జల డైరక్షన్‌లోనే అంతా నడుస్తోందని ఆరోపించారు. జగన్, హోంమంత్రిలకు పాలనతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు.

సీఐడీ అదుపులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

ఇవీ చదవండి:

Professor G Haragopal విద్యావ్యవస్థ బలోపేతంతోనే సామాజిక మార్పు: ప్రొఫెసర్​ జీ హరగోపాల్​

ఒక్కసారిగా గ్యాస్ ​లీక్​.. 11 మంది మృతి.. ఇళ్లల్లోనే స్పృహ తప్పిన ప్రజలు!

పుట్టిన రోజు నాడే పునర్జన్మ.. 20 గంటలు మృత్యువుతో పోరాడి..

Last Updated : Apr 30, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.