తూ.గో. లో నామినేషన్ల పర్వం తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అమలాపురం తెదేపా పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత జి.ఎం.సి. బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్‌నామినేషన్ వేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రాపురం తెదేపా అభ్యర్థి తోట త్రిమూర్తులుద్రాక్షారామం నుంచి రామచంద్రపురం వరకు పాదయాత్ర నిర్వహించి... ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రాజశేఖర్‌కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యరావు నామపత్రాలు ఇచ్చారు. ప్రత్తిపాడు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి వరుపుల రాజాఅట్టహాసంగా నామినేషన్ వేశారు. రాజమహేద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్ధి మార్గాని భరత్... సినీ నటుడు అలీ, నగర అసెంబ్లీ అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారి నిశాంత్‌కుమార్‌కు పత్రాలు అందజేశారు. రాజోలు వైకాపా అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. రామచంద్రాపురం వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైకాపా శ్రేణులతో ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి పొన్నాడ సతీష్ రిటర్నింగ్ అధికారి శేషి రెడ్డికి నామినేషన్ సమర్పించారు. రాజమహేంద్రవరం గ్రామీణ వైకాపా అసెంబ్లీ అభ్యర్ధి ఆకుల వీర్రాజు కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య నామినేషన్ వేశారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి.. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్దాపురం నియోజకవర్గ భాజపా అసెంబ్లీ అభ్యర్థిగా యార్లగడ్డ రామ్ కుమార్ నామినేషన్ వేశారు.