తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం.. తనకు బాధ కలిగించిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సీఎం జగన్‌కు రాసిన లేఖలో తన బాధను వ్యక్తం చేశారు.
అశోక్ గజపతిరాజు వంశీకులు వేల ఎకరాలు దానం చేశారని.. అటువంటి గౌరవనీయులపై వైకాపా నేతలెవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని.. జగన్‌ను ముద్రగడ కోరారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ ఎవరినీ అగౌరవపరిచే వ్యక్తి కాదని లేఖలో ప్రస్తావించారు.
ఇదీ చదవండి: