MRO arrest for playing cards: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని రాఘవపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడిచేసి కొందరిని అదుపులోకి తీసుకోగా.. అందులో జిల్లాకు చెందిన ఓ తహసీల్దారు ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఆదేశాలతో పోలీసు ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నవారిని పట్టుకుంది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం కోరుకొండ పోలీసుస్టేషన్‌లో పది మందిపై కేసు నమోదు చేశారు. వారిలో జిల్లాలోని ఓ మండలానికి చెందిన తహసీల్దారు ఉన్నారు. దీనిపై ఎస్సై కట్టా శారదా సతీష్‌ను వివరణ కోరగా.. వారిలో తహసీల్దార్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఇదీ చూడండి:
Ashok Fires On Govt: రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట