ETV Bharat / state

కరోనా భయం: వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకు రాని బంధువులు

కరోనా మానవత్వానికి మనుగడ లేకుండా చేస్తోంది. బంధువుల అంత్యక్రియలకు సైతం హాజరయ్యేందుకు వెనుకాడేలా చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా శృంగరాయునిపాలెంలో మరణించిన ఓ వృద్ధురాలి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో.. తన దిగువస్థాయి సిబ్బందితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా భయం :వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకురాని బంధువులు

author img

By

Published : Jul 23, 2020, 10:24 PM IST

కరోనా మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కావాల్సిన వారికి కడచూపునూ లేకుండా చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో దొంగర సుభధ్ర అనే వృద్ధురాలు బుధవారం మరణించింది. మృతురాలి కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉండటంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

విషయం తెలుసుకొన్న ఎంపీడీవో శ్రీలలిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం ఎంపీడీవో.. తన సిబ్బందితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.