రాజమండ్రి గోదావరి బ్రిడ్జి లిమిటెడ్ పేరిట రహదారిని నిర్మిస్తామని ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. రాజమహేంద్రవరం-కొవ్వూరు గామన్ వంతెన అనుసంధానిస్తూ... ఈ రోడ్డును నిర్మించనున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలకు ఈ మార్గం దెబ్బ తినటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా భరత్ అధికారులతో కలిసి ఈ వంతె పునర్నిర్మాన పనులకు శంకుస్థాపన చేశారు.
పన్నెండున్నర కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని భరత్ చెప్పారు. అలాగే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై వివిధ పైవంతెనల నిర్మాణాలకు త్వరలోనే టెండరు పిలుస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ...రాష్ట్రానికి 'కైనెటిక్' పరిశ్రమ