ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పొయిన తల్లి కుమారులు - ఉండ్రాజవరం

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అస్పత్రికి తరలించగా అప్పటికే కుమారుడు మృతి చెందగా తల్లి చికిత్స పొందుతూ ప్రాణం విడిచింది. వీరి మరణంతో కుటుంబసభ్యలు శోక సముద్రంలో మునిగిపోయారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 23, 2023, 9:33 AM IST

Mother and Son Died in Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న తల్లి కుమారులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వీరిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. తల్లి కుమారుల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామానికి చెందిన నార్ని పవన సూర్య గణేష్(22), అతని తల్లి వెంకట సత్యవతి(51) పనిమీద ముప్పవరనికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు నిడదవోలు మండలం కలవచర్ల వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న కారు వీరిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుమారుడు అప్పటికే ప్రాణాలు కోల్పొయాడు, చికిత్స అందిస్తుండగా తల్లి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహలను శవ పంచనామా కోసం.. మార్చురీకి తరలించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.