తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారని చంద్రబాబు చేసిన పోస్ట్‌పై ఆయన స్పందించారు. ఇంకా మార్కెట్లోకి పంట పూర్తిగా రాకుండానే రైతులకు గిట్టుబాటు ధర లేదు, నష్ట పోతారని తెదేపా అధ్యక్షుడు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడటం సరికాదన్నారు. పంట పూర్తిగా వచ్చాక గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి వారిని అన్నివిధాల ఆదుకుంటుమన్నారు.
ఇవీ చదవండి
జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది పని తీరుపై మంత్రి మోపిదేవి అసంతృప్తి