తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో గ్రావెల్ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకొన్నారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు గ్రావెల్ తరలిస్తుంటే.. ఎలాంటి అనుమతుల్లేకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు సమాచారం అందించి అక్రమ తవ్వకాలపై నిలదీశారు. దీనింతటికీ తానే కారణమని స్థానిక వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఓ యువకుడు ఆవేదన ఇప్పుడు వైరల్గా మారింది. తాను చాలా ఏళ్లుగా వైకాపాలోనే ఉన్నానని... పొలం అమ్ముకొని పార్టీ విజయం కోసం శ్రమించానని చెప్పుకొచ్చాడు. అక్రమ తవ్వకాలు అడ్డుకున్నాననే అక్కసుతో చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించాడు. తనకు ఏం జరిగినా స్థానిక వైకాపా నేతలతో బాధ్యతని చెబుతూ సోషల్ మీడియాలో ఆ దళిత యువకుడు పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
వైరల్: గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే చంపేస్తారట... వైకాపా కార్యకర్త ఆవేదన
పార్టీ కోసం పొలాలు అమ్ముకొని కష్టపడితే బెదిరింపులే బహుమానమా అంటూ ప్రశ్నిస్తున్నాడు ఓ వైకాపా కార్యకర్త. గ్రామంలో గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్నందుకు స్థానిక ముఖ్యనేతలు చంపుతామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో గ్రావెల్ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకొన్నారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు గ్రావెల్ తరలిస్తుంటే.. ఎలాంటి అనుమతుల్లేకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు సమాచారం అందించి అక్రమ తవ్వకాలపై నిలదీశారు. దీనింతటికీ తానే కారణమని స్థానిక వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఓ యువకుడు ఆవేదన ఇప్పుడు వైరల్గా మారింది. తాను చాలా ఏళ్లుగా వైకాపాలోనే ఉన్నానని... పొలం అమ్ముకొని పార్టీ విజయం కోసం శ్రమించానని చెప్పుకొచ్చాడు. అక్రమ తవ్వకాలు అడ్డుకున్నాననే అక్కసుతో చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించాడు. తనకు ఏం జరిగినా స్థానిక వైకాపా నేతలతో బాధ్యతని చెబుతూ సోషల్ మీడియాలో ఆ దళిత యువకుడు పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
ఐదు నెలల పాప అదృశ్యం...కేసు నమోదు చేసిన పోలీసులు