రంపచోడవరం, బీరంపల్లి, వెలమలకోట గ్రామాల్లో సీసీ రహదారులకు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు శంకుస్థాపన చేశారు. రూ. 41 లక్షల నిధులు వెచ్చించనున్నామన్నారు. ఏజెన్సీలో సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తామన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు తదితర మౌలిక వసతులకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపించి నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: