వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆలమూరు మండలం బడుగువాణి లంకలో పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు బియ్యం, ఆహార పొట్లాలు అందజేశారు. వరదలు తగ్గుముఖం పడుతున్నాయని.. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత వరద పరిస్థితిపై రామచంద్రాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలచంద్రారెడ్డితో చర్చించారు. అనంతరం వరదల నుంచి తేరుకుంటున్న వాణిజ్య పంటలను పవర్ బోటులో వెళ్లి పరిశీలించారు.
ఇవీ చదవండి..