ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు... ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి? అనే వివరాలను అడిగి గురించి తెలుసుకున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: