తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. విధుల్లో ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు రేయింబవళ్లు పోలీసులు కష్టపడుతున్నారన్నారు. వీరంతా సైనికులుగా పని చేస్తున్నారని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సూచించారు. పోలీసులు సైతం సామరస్యంగా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు. అనపర్తి సీఐ భాస్కరరావు మాట్లాడూతూ, రహదారులపై గుంపులు గుంపులుగా ప్రజలు ఉండవద్దన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు చేసినందుకు ఎమ్మెల్యేకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: 'రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం'