ఆక్వా ఉత్పత్తులు చైనాకు ఎగుమతి చేసేందుకు సానుకూల సంకేతాలు అందినట్లు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత, లాక్ డౌన్ అమలుపై నేతలు సమీక్షించారు. కరోనా ప్రబలకుండా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, నూనె మిల్లుల యాజమాన్యాలతో కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమావేశమయ్యారు. నూనె ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి, రవాణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఇళ్లకు అంబేడ్కర్ యువజన సంఘం కూరగాయలు పంపిణీ చేసింది.
జిల్లాలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్ అమలుపై మంత్రులు సమీక్ష - CORONA LATEST IN EAST GODAVARI
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్ అమలుపై మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ సమీక్ష నిర్వహించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి సానుకూలత ఉందని మంత్రులు తెలిపారు. మరోవైపు అధికారులు, నూనె మిల్లుల యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించగా... నూనె ఉత్పత్తుల ప్రొసెసింగ్, ఎగుమతి, రవాణాకు సహకారిస్తామని హామీ ఇచ్చారు.
ఆక్వా ఉత్పత్తులు చైనాకు ఎగుమతి చేసేందుకు సానుకూల సంకేతాలు అందినట్లు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత, లాక్ డౌన్ అమలుపై నేతలు సమీక్షించారు. కరోనా ప్రబలకుండా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, నూనె మిల్లుల యాజమాన్యాలతో కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమావేశమయ్యారు. నూనె ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి, రవాణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఇళ్లకు అంబేడ్కర్ యువజన సంఘం కూరగాయలు పంపిణీ చేసింది.
ఇవీ చూడండి-కరోనా వ్యాప్తి నియంత్రణపై మంత్రుల సమీక్షలు