మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట లో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు మంత్రి విశ్వరూప్ చెక్కు అందించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే నెరవేర్చామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆసరా కోసం మొదటి విడతగా 6,400 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ విధంగా వచ్చిన డబ్బు మహిళలకు జీవనోపాధికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: