సోమవారం తూర్పుగోదావరి జిల్లా మేడపాడు బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఎంపీ వంగా గీత మంగళవారం క్షతగాత్రులను పరామర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదం సంభవించిన దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి :