ETV Bharat / state

కాకినాడ సెజ్ భూములపై సీఎం నిర్ణయం చారిత్రాత్మకం: మంత్రి కన్నబాబు

కాకినాడ సెజ్ భూములపై సీఎం జగన్​మోహన్​రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం రైతుల భూములు తిరిగి ఇవ్వడం అభినందనీయమని అన్నారు. సెజ్‌ భూముల పరిధిలోకి వచ్చిన ఆరు గ్రామాలను యధావిధిగా విడిచి పెట్టామని ఆయన వెల్లడించారు.

minister kannababu
మంత్రి కన్నబాబు
author img

By

Published : Feb 26, 2021, 9:28 PM IST

కాకినాడ సెజ్‌ భూములపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి కన్నబాబు అన్నారు. రెండు వేల నూట ఏనభై ఎకరాలు తిరిగి రైతులకు ఇవ్వడం అభినందనీయమని కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పిఠాపురం సభలో రైతులకు హామీ ఇచ్చారని.. ఆ ప్రకారంగా సెజ్‌ భూములపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఇచ్చిన సిపార్సుల మేరకు కేబినెట్​ ఈనెల 23న ఆమోదించడం జరిగిందన్నారు.

దీనితో పాటు సెజ్‌ భూముల పరిధిలోకి వచ్చిన ఆరు గ్రామాలను యధావిధిగా విడిచి పెట్టామని అన్నారు. 15 ఏళ్లుగా ఎంతో వివాదాస్పదంగా ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని.. ఆ గ్రామాలను పూర్తి అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఉత్తమ వాలంటీర్లకు ఉగాది నుంచి సత్కారాలు..3 కేటగిరీలుగా అర్హుల ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.