రైతు భరోసా గడువు మరో మూడు రోజుల్లో ముగుస్తున్నందున... అన్ని జిల్లాల్లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి కన్నబాబు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం, సమాచార నమోదు, తదితర అంశాల జాబితాలు సిద్ధం చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉండాలని ఆదేశించినట్టు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు ఇబ్బందులు వస్తాయని.. అక్కడ ఆఫ్‌లైన్‌లో వివరాలు సేకరించాలని ఆదేశించామన్నారు. పేర్లు నమోదు చేసుకోని రైతులు ఈనెల 15 లోపు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ చేసుకోలేకపోతే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న రైతులనూ.. గుర్తించి వారికి రైతు భరోసా అమలయ్యేలా చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి