తూర్పుగోదావరి జిల్లాలో బిహార్, ఝార్ఖండ్ వాసులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇంకా పడిగాపులు పడుతున్నారు. అనపర్తి, ద్వారపూడి, కాట్రేనికోన తదితర ప్రాంతాల్లోని చిన్న తరహా పరిశ్రమల్లో కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించిన సమయం నుంచి వీరు అక్కడే ఉండిపోయారు. వీరికి అన్ని పరీక్షలు నిర్వహించిన అధికారులు స్వస్థలాలకు పంపించేందుకు అనుమతి పత్రాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం నుంచి శ్రామిక రైలులో 35 మంది ఝార్ఖండ్ వాసులను పంపించగా... బిహార్‌కు చెందిన వారంతా రాజమహేంద్రవరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పడిగాపులు కాస్తున్నారు.
ఇదీ చదవండి: