విశాఖ జిల్లా సీలేరు నుంచి తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి జలాశయానికి వచ్చే కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలోని డొంకరాయి గ్రామానికి చెందిన గంగిరెడ్ల రాంబాబు ఆటో నడుపుతుంటాడు. సీలేరు జల విద్యుత్ కేంద్రం దిగువన నూకాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న కాలువలోకి దిగిన అతను కాలు జారి పడిపోయాడు. ఆటో డ్రైవర్లు గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: భారీగా బెల్లం ఊట ధ్వంసం