కాపు ఉద్యమాన్ని నడిపించాలన్న రాష్ట్ర కాపు జేఏసీ నాయకుల కోరికను.. ముద్రగడ పద్మనాభం సున్నితంగా తిరస్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి 13 జిల్లాల జేఏసీ నాయకులు వచ్చారు. వారితో ముద్రగడ సమావేశమయ్యారు. ఇటీవల కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ భేటీ జరిగింది.
13 జిల్లాల జేఏసీ నాయకులు ముద్రగడనే ఉద్యమం నడిపించమని కోరగా.. ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తాను నాయకత్వం వహించకపోయినా మనమంతా ఎప్పటికీ స్నేహితులమే అని చెప్పారని నాయకులు మీడియాతో తెలిపారు. అయితే ముద్రగడ పద్మనాభమే తమ నాయకుడని, వారి ఆధ్వర్యంలోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ్‌లు స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: 'ఏపీ పోలీస్ సేవ' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్