WOMEN MAOIST SURRENDERED: మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలు కలుమా నందే అలియాస్ సుశీల.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయి.. ఆమె లొంగిపోయినట్లు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ తెలిపారు. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకుని.. అడవి బాట వీడి.. సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుందని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని అల్లివాగు గ్రామానికి చెందిన సుశీల(20).. శబరి ఏరియా కమాండర్ గీత నిర్వహించిన సమావేశానికి ఆకర్షితురాలై 2019లో దళంలో చేరిందని తెలిపారు. అనంతరం ఆమెకు.. 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చి.. ఒక నెల దళ సభ్యురాలిగా పంపించారని, ఆ తర్వాత ఆమెను టెక్నికల్ టీంకు పంపారని చెప్పారు.
అప్పసి నారాయణ రమేష్ వద్ద ఆరు నెలలు పని చేసిన అనంతరం.. చర్ల ఎల్ఓఎస్లో దళ సభ్యురాలుగా పని చేస్తోందని ఎస్పీ వివరించారు. ఆ సమయంలో 12- బోర్ ఎస్బీబీఎల్(సింగిల్ బేరల్ బ్రీచ్ లోడింగ్) గన్ ఉపయోగించిందని తెలిపారు.
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. గొత్తికోయ యువతను మావోయిస్టులు దళాల్లోకి చేర్పించుకుంటున్నారని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పించడంతోపాటు.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు
ఇదీ చదవండి: