తూర్పుగోదావరి జిల్లా మన్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. చింతూరు మండలంలో రహదారి పనులకు ఉపయోగిస్తున్న ఆరు వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్లు, ఒక లారీ, ఒక సిమెంట్ మిక్సింగ్ యంత్రాన్ని తగలబెట్టారు. మావోయిస్టులు వాహనాలను దగ్ధం చేయడంతో మన్యంలో అలజడి రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం చుట్టు పక్క గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో కూలిన విమానం- ఐదుగురు మృతి