Mango Egg: ప్రపంచంలో నిత్యం ఏదో ఒకచోట ఏదో ఒక విచిత్రం జరుగుతూనే ఉంటుంది. అలాంటి విచిత్రమే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఇదిగో ఈ చిత్రం చూశారు కదా..! ఒకటి మామిడి కాయ.. రెండోది ఏంటీ?..
మామిడికాయ తెల్ల రంగులోకి మారిందనుకుంటున్నారా.. సరిగ్గా చూడండి.. ఇది కోడిగుడ్డు. మామిడి కాయ ఆకారంలో చూపరులను ఆశ్చర్యపరిచిన ఈ గుడ్డు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని సత్తిబాబు కిరాణా దుకాణంలో కనిపించింది. మామిడికాయ, గుడ్డూ రెండూ పక్కపక్కనే పెట్టగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి:
"ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది... లేకుంటే బతికేది"