ETV Bharat / state

'మనం-మన పరిశుభ్రత'తో పారిశుద్ధ్యం మెరుగు - rampa chodavaram latest news

'మనం మన పరిశుభ్రత' ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిందని రంపచోడవరం డివిజనల్​ పంచాయతీ అధికారి హరినాథ్​ బాబు తెలిపారు.

manam mana parisubratha programme for developing sanitary facilities in village areas
రంపచోడవరం డివిజనల్​ పంచాయతీ అధికారి హరినాథ్​ బాబు
author img

By

Published : Jun 2, 2020, 5:22 PM IST

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 'మనం-మన పరిశుభ్రత' అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని 11 మండలాల్లో ఒక్కో మండలానికి రెండు పంచాయతీల చొప్పున ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఎంపిక చేసిన పంచాయతీల్లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందన్నారు. పంచాయతీలో ఒక్కో ఇంటి నుంచి రూ. 2 చొప్పున నెలకు రూ.60 వసూలు చేస్తామన్నారు. ఆ డబ్బులతో పారిశుద్ధ్యానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. దీంతోపాటుగా ప్రభుత్వం నుంచి పారిశుద్ధ్యానికి ప్రత్యేక నిధులు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై జిల్లా పంచాయతీ అధికారి కాకినాడ నుంచి డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇదీ చదవండి :

'పరిసరాల పరిశుభ్ర ఎంతో ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.