ETV Bharat / state

బాలయోగి వారధి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య!

యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి దూకి అంబేడ్కర్​ నగర్​కు చెందిన మోకా కళ్యాణ్ మూర్తి... ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు.

man makes suicide attempt in yanam at east godavari
బాలయోగి వారధిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..??
author img

By

Published : Jul 3, 2020, 2:20 PM IST

యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి దూకి అంబేడ్కర్​ నగర్​కు చెందిన మోకా కళ్యాణ్ మూర్తి... ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బ్రిడ్జి వద్ద గస్తీ చేస్తున్న పోలీసు ఫోను నుంచి తండ్రి మోహనరావుతో ఫోన్​లో మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. అర్థరాత్రి దాటినా ఇంటికి రాకపోవడం..సెల్​ఫోన్ ఎత్తకపోవటంతో కళ్యాణ్ మూర్తి తండ్రి పోలీసు వద్దకు వచ్చాడు. కుమారుడు అక్కడ లేకపోవడంతో వారధి మీద పరిశీలించారు. కుమారుడు ఉపయోగించే వాహనం, చరవాణి, చెప్పులు, కనిపించాయి. దీంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కల్యాణ్ మూర్తికి భార్య.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతను గతంలో ఆటో నడిపేవాడు. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పోలీసులు, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది... గోదావరిలో గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి:

పురుషోత్తపట్నానికి వీడని చిక్కుముడి.. నీటి విడుదలపై ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.