తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన కోటిపల్లి నవీన్ ద్విచక్రవాహనంపై రావులపాలెం నుంచి జొన్నాడ వైపు ప్రయాణిస్తూ.. గౌతమి పాత బ్రిడ్జిపై నుంచి గోదారిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అకస్మాత్తుగా యువకుడు గోదావరిలో దూకడాన్ని చూసిన ఆలమూరు హైవే పోలీస్ పెట్రోలింగ్ వెంటనే స్పందించారు.
పైలెట్ జీవీవీఎస్ మూర్తి, హెచ్‌సీ ఆర్ఎస్వీ రాజులు గోదారి గట్టుకు చేరుకుని నావపై వరద ఉద్ధృతిలో మునిగిపోతున్న నవీన్‌ను కాపాడారు. ఈ ఘటనను అటుగా వెళుతున్న ప్రయాణికులు ఉత్కంఠగా పరిశీలించారు. సదరు యువకుడు విశాఖ డెయిరీలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: