తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాకినాడలోని మధురా నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన 5ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తెతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. ఔట్ పోస్టు వద్ద ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: తూర్పుగోదావరి కలెక్టరేట్ ఎదుట కళాకారుల వినూత్న నిరసన