ETV Bharat / state

విషాదం: గోదావరిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే బిడ్డలను కడతేర్చాడు. గోదావరిలో పిల్లలను తోసేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తాను సైతం ఆత్మహత్య చేసుకున్న ఘటన యానాంలో జరిగింది. కుటుంబ కలహాలే మరణాలకు కారణమని పోలీసులు తెలిపారు.

man along with his children attempts suicide in yanam
ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తండ్రి
author img

By

Published : Jun 26, 2020, 7:46 PM IST

Updated : Jun 27, 2020, 5:01 PM IST

కుటుంబ కలహాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో విషాదం చోటు చేసుకుంది. ఎదుర్లంక వారధిపై నుంచి ఓ తండ్రి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న మొమ్మిడి శ్రీనివాస్... కుమార్తె హరిణి, కుమారుడు హర్షతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చి గోదావరిలో దూకేశాడు.

నిన్న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్​లో శ్రీనివాస్​పై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మత్స్యకారులు... గోదావరిలో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా పరిశీలించి వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

గోదావరి తీరంలో కనులకు విందు.. కారు మబ్బు అందాలు

Last Updated : Jun 27, 2020, 5:01 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.