"పిల్లల్ని అంతర్జాలానికి, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచండి"
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలోని బాధితురాలిని మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
తూర్పుగోదావరిలో అత్యాచార బాధిత చిన్నారిని పరామర్శించిన మహిళా కమిషన సభ్యురాలు రాజ్యలక్ష్మి, బాలల హక్కుల కమిషన్ సభ్యులు గాంధీ
తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల అత్యాచారానికి గురైన చిన్నారిని మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం బాధితురాలిని ఆదుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అత్యాచారానికి పాల్పడినవారు సైతం మైనర్లు కావడంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. స్మార్ట్ ఫోన్, అంతర్జాలం వినియోగం కారణంగానే పిల్లలు.. చిన్న వయసులో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అంతర్జాలంలోని అశ్లీల వెబ్ సైట్లను తొలగించాలని కోరారు. తల్లిదండ్రులు సైతం బాధ్యత తీసుకుని తమ పిల్లలను ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గాంధీ సైతం అత్యాచార ఘటనపై స్పందించి బాధిత బాలికను పరామర్శించారు. ఇదీ చదవండి;
sample description