తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంక ప్రాథమికోన్నత పాఠశాలలో.. నాడు - నేడు పనులను అధికారులు చేపట్టారు. సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఇసుక కోసం ఆన్లైన్లో బుక్ చేశారు. 30 టన్నుల ఇసుకను బుక్ చేయగా జొన్నలంక ర్యాంపు నుంచి మూడు లారీల్లో తీసుకొచ్చారు.
మట్టితో కూడిన నాసిరకం ఇసుక రావడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. స్థానికులు మరో 2 లారీల్లో ఇసుకను పరీక్షించగా.. అందులోనూ అదేవిధంగా ఉండటంతో ఇసుక దిగుమతి చేయడం కుదరదని వెనక్కి పంపించారు. ఇదే అంశంపై సమగ్ర శిక్ష అభియాన్ జేఈ రాంజీని ఈటీవీ భారత్ వివరణ కోరగా నాసిరకం ఇసుక రావడం వాస్తవమేనని.. తిప్పి పంచామని చెప్పారు.
ఇవీ చూడండి: