తూర్పు గోదావరి జిల్లాలో రోజు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య 1000 దాటుతుండడంతో... కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత యానాంలోనూ గడచిన రెండు వారాల్లో 300కు పైగా కేసులు బయటపడడంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశాలతో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. బుధ, గురువారాలు నిబంధనలు సడలించి ఉదయం 6 గంటల నుండి ఒంటిగంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతులిచ్చారు. తిరిగి శుక్రవారం నుంచి ఆదివారం వరకు పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు యానాం సంయుక్త పాలనాధికారి శివరాజ్ మీనా తెలిపారు. లాక్ డౌన్ రోజులలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు సహా అన్నీ మూసివేయాలని అధికారులను ఆదేశించారు. యానాంలోకి ప్రవేశించే రెండు ప్రధాన మార్గాలను అధికారులు బారికేడ్లతో మూసివేశారు.
ఇదీ చదవండి: