లాక్డౌన్ కారణంగా పలు పురపాలక సంఘాలకు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. గడిచిన మూడు నెలల పాటు అద్దె చెల్లించలేమని దుకాణాదారులు చేతులెత్తేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘ పరిధిలో 606 దుకాణాలు ఉండగా నెలకు అద్దెల రూపంలో రూ. 10 లక్షలు రావాల్సి ఉంది.
అయితే లాక్ డౌన్ కారణంగా దుకాణాలు తెరుచుకోనందున.. దుకాణాదారులు అద్దె చెల్లించలేకపోయారు. పురపాలక సంఘం ఆదాయానికి గండి పడింది. వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మూడు నెలల అద్దెలు రద్దు చేయాలని పురపాలక దుకాణాల్లో అద్దెకు ఉంటున్నవారు కోరుతున్నారు. వ్యాపారుల నుంచి వినతులు వస్తే ప్రభుత్వానికి నివేదించి ఆదేశాలను అనుసరించి వ్యవహరిస్తామని పురపాలక కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు.
ఇవీ చూడండి...