ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముంగండంలో సంవత్సరాల తరబడి ఆక్రమణలో ఉన్న ఆలయానికి సంబంధించిన భూమిని గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రహదారి వెంట పోతురాజు బాబు గుడికి సంబంధించిన లక్షలాది రూపాయలు విలువ చేసే భూమి ఆక్రమణకు గురైంది. పూర్వకాలం నుంచి ఈ భూమి ఆలయ పరిధిలో ఉందని స్థానికులు తెలిపారు. కొంతమంది ఆక్రమించుకుని సొంతంగా వాడుకుంటున్నారని ఈ రోజు ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నామని గ్రామస్థులు వెల్లడించారు. అక్కడ పోతురాజు బాబు మూలవిరాట్టు ఉందని.. త్వరలో గుడి నిర్మిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:'ఆపరేషన్ కశ్మీర్'లో కేంద్రం తదుపరి వ్యూహం ఏంటి?