ETV Bharat / state

పాడుబడిన థియేటర్​లోని దృశ్యాలు చూసి అధికారులు షాక్! - రాజానగరంలోని లక్ష్మీ థియేటర్ కూల్చివేత వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో ఉన్న థియేటర్​ను అధికారులు కూలగొట్టారు. అయితే అంతకు ముందుకు థియేటర్​ తలుపులను పగులగొట్టిన అధికారులు... అక్కడి దృశ్యం చూసి అవాకయ్యారు. ఇంతకీ అక్కడ వారు ఏం చూశారంటే?

Lakshmi Theater in rajanagaram demolished

author img

By

Published : Jul 4, 2020, 11:16 PM IST

పాడుబడిన థియేటర్​లోని దృశ్యాలు చూసి అధికారులు షాక్!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని వైఎస్సార్ కూడలిలో ఉన్న లక్ష్మీ థియేటర్​ను శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూలగొట్టారు. అనంతరం గత 50 సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుల్లో ఒకరైన నున్న చంద్రావతి అనే మహిళ.. థియేటర్​ను కూలగొడితే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అక్కడే ఉన్న రాజానగరం ఎస్సై శివ నాగబాబు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

థియేటర్​ తలుపులు తొలగించి దేవాదాయ శాఖ అధికారులు లోపలికి ప్రవేశించారు. లోపల కనిపించిన దృశ్యం చూసి వారు అవాక్కయ్యారు. మూడు లోతైన గోతులు.. వాటి చుట్టూ నిమ్మకాయలు, పువ్వులు, కత్తి, రక్తపు చారలు తదితర సామగ్రి అక్కడ కనిపించాయి. నిధి నిక్షేపాలు ఉంటాయనే ఆశతో క్షుద్ర పూజలు చేసి ఉంటారని దేవాదాయ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం జేసీబీ సాయంతో థియేటర్​ను కూలగొట్టారు.

ఇదీ చదవండి

కరోనా కాటుతో వెలవెలబోతున్న వెండితెర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.