తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 15 వందల కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందన్నారు.
ఇవీ చదవండి.. నిన్న దుర్వాసనతో.. నేడు ఉత్సాహంతో..!