తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో మతి స్థిమితం లేని వ్యక్తి.. చిరిగిన దుస్తులతొ కొంతకాలంగా సంచరిస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట ప్రధాన రహదారి పక్కనే దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటున్నాడు. అతడి నుంచి దుర్వాసన వస్తున్న కారణంగా.. స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు... సిబ్బంది సహకారంతో అతడిని ట్రాకర్ పై పంచాయతీ కార్యాలయం వద్దకు తరలించి స్నానం చేయించి, గుండు చేయంచి, ఉతికిన దుస్తులు తొడగించారు. అప్పటినుంచి అతను ఉత్సహంగా కనిపించాడు. ఎస్సై చిన్నారావు అతడి వద్దకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేస్తామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, సిబ్బందిని పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: