తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఖరీఫ్ వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి మామిడికుదురు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం మీద 22,837 ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ వరి సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 16,317 ఎకరాల విస్తీర్ణంలో నాట్లు పూర్తి అయినట్లు పి గన్నవరం వ్యవసాయ సహాయ సంచాలకులు రామ్మోహన్ రావు తెలిపారు. మామిడికుదురు మండలంలో అత్యల్పంగా నాట్లు పడ్డాయి. ఈ మండలంలో 3,405 ఎకరాలు ఉండగా ఇంతవరకు 605 ఎకరాలలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి.
ఇదీ చూడండి
మానవత్వాన్ని చూపిన ఎమ్మెల్యే.. యువకుడి ప్రాణాలకు తప్పిన ప్రమాదం